అర్జున్ సమాచారం:
రైల్వే ట్రాక్ దాటేందుకు ఫతేనగర్ బ్రిడ్జిపైకి ఎక్కి దిగడం మహిళలు, వృద్ధులకు తీవ్ర ఇబ్బందిగా మారుతోందని, ఇక్కడ వెంటనే ఎలివేటర్ ఏర్పాటు చేయాలని కోరారు.
తాగునీటిలో డ్రైనేజీ నీరు కలుస్తోందని, మురికి నీరు వస్తుండటంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫతేనగర్‌కు సమీపంలోని లాల్ బహదూర్ శాస్త్రి నగర్లో సుమారు 10 వేల పేద కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ వేలాది మంది పిల్లలు ఉన్నప్పటికీ పదవ తరగతి వరకు సరైన పాఠశాల సౌకర్యం లేదని, దీంతో విద్యార్థులు ప్రాణాలకు తెగించి రైల్వే ట్రాక్ దాటి సనత్‌నగర్‌కు వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. పిల్లల చదువుల నిమిత్తం ఈ ప్రాంతంలో 10వ తరగతి వరకు ఒక ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరారు.
సమస్యల పరిశీలన
అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ వేలాది మంది రైల్వే పట్టాలు దాటుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైళ్ల వేగం, ఫ్రీక్వెన్సీ పెరగడంతో పట్టాలు దాటే సమయంలో తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. పెద్ద నగరాల్లో ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనన్ని ఎక్కువ చిన్న అండర్‌పాస్‌లు, అండర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే రైల్వే మంత్రితో మాట్లాడినట్లు తెలిపారు.
ఫతేనగర్ బ్రిడ్జిని పరిశీలించిన ఆయన, ప్రతిరోజూ సుమారు వెయ్యి మంది ఇక్కడ రైల్వే పట్టాలు క్రాస్ చేస్తున్నారని చెప్పారు. కూలిపోయిన పాత మెట్ల స్థానంలో కొత్తవి నిర్మించామని, త్వరలోనే ఫతేనగర్ బ్రిడ్జి పక్కనే ఆర్ఓబీ (ROB) నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు.
=========================